Friday, May 9, 2025
- Advertisement -

ఏపీ చరిత్రలో అపురూప ఘట్టం..

- Advertisement -

ఏపీ చరిత్రలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 210 అడుగుల ఎత్తైన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్..నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే అందర్నీ ఒక్కతాటిపై నిలబెట్టామ… పోరాటానికి ఆయన మరో రూపమని కొనియాడారు.

మరణం లేని మహానేత అంబేద్కర్ అని కొనియాడిన జగన్..సామాజిక చైతన్యవాడలా విజయవాడ ఉందన్నారు. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని మండిపడ్డారు. అంబేద్కర్‌ భావజాలం పెత్తందార్లకు నచ్చదు.. వారికి దళితులంటే చులకన అని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పేదింటి అక్కచెల్లెమ్మలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్లపట్టాలిచ్చాం.. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదని దుయ్యబట్టారు.

స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుందని స్పష్టం చేశారు జగన్. అంటరానితనం రూపం మార్చుకుందని, పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరాని తనమేనని ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం, వారి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం అంటరానితనమేనని పచ్చమీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంబేదక్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, దాని కోసం నిర్మించిన పీఠం ఎత్తు 85 అడుగులు. ఈ విగ్రహం దేశంలో అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంగా రికార్డులకెక్కింది. 18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రూ.404.35 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఉదయం, సాయంత్రం వేళ్లలో నడకకు వీలుగా వాకింగ్ ట్రాక్‌లు నిర్మించారు. ఈ స్మృతివనంలో అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 2 వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, అలాగే, ఫుడ్‌కోర్టు, పిల్లల కోసం ఆటస్థలం, మ్యూజికల్ ఫౌంటేన్, నీటి కొలన్లు ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -