Thursday, May 8, 2025
- Advertisement -

ఇంద్రవెల్లిలో రేవంత్ జంగ్ సైరన్..తొలి సీఎం

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.గతంలో పీసీసీ చీఫ్ హోదాలో ప్రచారాన్ని ఇంద్రవెల్లి నుండే మొదలు పెట్టగా ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. ఇంద్రవెల్లిలో ఇవాళ జంగ్ సైరన్ మోగించనున్నారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి సభకు భారీగా జనాలను తరలించే ఏర్పాట్లు చేశాయి కాంగ్రెస్ శ్రేణులు.

ఇదే సభ ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగమైన మరో రెండు గ్యారెంటీలను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రూ. 500 కు గ్యాస్ సిలిండర్ పథకానికి, గృహజ్యోతిలో భాగమైన 200 ఉచిత యూనిట్ గ్యారెంటీని ప్రారంభించనున్నారు. ఇక తొలుత కేస్లాపూర్ లో నాగోబా దేవతకు సీఎం రేవంత్ పూజలు చేస్తారు. తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుని కొమురం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు రేవంత్.

సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను రాజకీయ సెంటిమెంట్. గతంలో పీసీసీ చీఫ్ హోదాలో 2022 ఆగస్టు 9న రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలోనే మొదటి సభ నిర్వహించారు. సభ విజయవంతం కావడంతో రేవంత్ రెడ్డి వెనుదిరిగి చూడలేదు. అదే సెంటిమెంట్ తో ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లి గడ్డపై రేవంత్ అడుగు పెడుతున్నారు. ఇంద్రవెల్లి రణస్థలిలో అమరుల స్థూపానికి నివాళులర్పించనున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -