- Advertisement -

హరీష్ రాజీనామాపై సీఎం రేవంత్..మేం మాట నిలబెట్టుకున్నాం!

- Advertisement -

తెలంగాణ రైతు రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. రైతుల ఖాతాల్లో తొలి విడతలో లక్ష రూపాయల వరకు రూ.6098 కోట్లను 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. ఇక రైతు రుణమాఫీ నిధుల కార్యక్రమం సందర్భంగా ముఖాముఖిగా మాట్లాడారు సీఎం రేవంత్. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ మాట అంటే శిలాశాసనం అన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు చురకలు అంటించారు. రుణమాఫీ చేస్తే.. రాజీనామా చేస్తా అన్నవాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి…. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదన్నారు. మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం.. మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పుకొచ్చారు.

తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది మరిచిపోలేని రోజని… దేశానికి ఆదర్శంగా నిలిచే అవకాశం తనకు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసి, తెలంగాణ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలబడబోతోందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఎక్కడ చేసామో అక్కడే కృతజ్ఞత సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామన్నారు రేవంత్. రుణమాఫీ నిధుల విడుదలతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -