ఐబొమ్మ రవి ఓ మాస్టర్ మైండ్ అన్నారు సీపీ సజ్జనార్. వేరే పేరుతొ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్, PAN కార్డు తీసుకున్నాడు అన్నారు. రవి ముందు నుంచే క్రిమినల్ మైండ్ సెట్ తో ఉండే వాడు అన్నారు సజ్జనార్. టెక్నాలజీని లోతుగా వాడుకుని ఈ పైరసీ రాకెట్ నడిపించాడు అన్నారు.
అలాగే ఐ-బొమ్మ రవి గురించి కీలక విషయాలు వెల్లడించారు సజ్జనార్.OTT లో రిలీజ్ అయ్యే సినిమాలను కొత్త టెక్నాలజీని ఉపయోగించి స్క్రీన్ రికార్డింగ్ చేసే వాడు అన్నారు. అదంతా మంచి క్వాలిటీతో వెబ్సైట్ లలో అప్లోడ్ చేసేవాడు అన్నారు.
హై-ఎండ్ టెక్నాలజీతో సీక్రెట్ కెమెరాల ద్వారా కొత్త సినిమాలను రికార్డ్ చేసేవాడు… ఈ మొత్తం పైరసీ రాకెట్ టెలిగ్రామ్ ద్వారా నడిచింది అన్నారు సజ్జనార్. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రవి ఇప్పుడు ఎక్కడున్నాడు? దయచేసి పోలీసులు, ప్రభుత్వం ఏమీ చేయదు అనుకోవద్దు. చట్టాన్ని లైట్ తీసుకుంటే ఏమవుతుందో చూశారు కదా? అన్నారు.
అలాగే iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి పాస్‌పోర్టును మీడియాకు చూపించారు సజ్జనార్.
ఐ-బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా అన్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా ఏళ్ల నుంచి ఈ పైరసీ అనే మహమ్మారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆందోళన చెందాం… ఎంతో మంది కష్టాన్ని ఒకడు అప్పనంగా దోచుకుంటుంటే బాధ అయ్యేది అన్నారు. హైదరాబాద్ పోలీసులకు ఈ విషయంలో సినీ పరిశ్రమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా
అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఐ-బొమ్మ విషయంలో హైదరాబాద్ పోలీసులకు కంగ్రాట్స్ చెప్తున్నా అన్నారు నాగార్జున. మేము ఇక్కడ చేయలేనిది హైదరాబాద్ లో చేశారు అని చెన్నైలో ఓ మిత్రుడు కాల్ చేసి చెప్పాడు…ఐ- బొమ్మ వెనక ఓ పెద్ద ఇంటర్నేషనల్ రాకెటే ఉంది అన్నారు.
6 నెలల క్రితం మా ఇంట్లోనూ ఇలానే డిజిటల్ అరెస్ట్ జరిగింది … వాళ్ల అసలైన మోటివ్ జనాలకు ఫ్రీగా సినిమాలు చూయించడం కాదు …ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లు వాళ్లకు చిల్లరతో సమానం అన్నారు నాగ్.
పైరసీ వల్ల మాకంటే ఎక్కువ అమాయక జనాలే నష్టపోతున్నారు అన్నారు దర్శకుడు రాజమౌళి. మీ పర్సనల్ డేటా అంతా తీసుకుని మీకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు. దీని వెనక వేల కోట్ల రాకెట్ ఉంది. ఏదీ మనకు ఉచితంగా రాదు. ఒకవేళ వస్తుంది అంటే దాని వెనక ఏదో ఒక హిడెన్ స్కాం ఉండే ఉంటుంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి అన్నారు.
