Sunday, May 4, 2025
- Advertisement -

NBK 109..డాకు మహారాజ్!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో ఇది ‘NBK109’ సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అందరూ ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్‌ టీజర్ విడుదలైంది. కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్ ని ప్రకటించడంతో పాటు, టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాకి ‘డాకు మహారాజ్’ అనే శక్తివంతమైన టైటిల్ ను పెట్టారు. 96 సెకన్ల నిడివితో రూపొందిన ‘డాకు మహారాజ్’ టీజర్, టైటిల్ కి తగ్గట్టుగానే అద్భుతంగా ఉంది.

మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -