Saturday, May 10, 2025
- Advertisement -

కాంగ్రెస్‌కు మాజీ డిప్యూటీ సీఎం దామోదర గుడ్‌బై?

- Advertisement -

వరుస చేరికలతో జోష్ మీదున్న తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. కొంతకాలంగా పార్టీలోని నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పటాన్‌చెరు,నారాయణ ఖేడ్‌ సీట్ల విషయంలో దామోదర తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మూడో జాబితాలో దామోదర వర్గానికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన నీలం మధుకు పటాన్‌చెరు సీటు కేటాయించింది. దీంతో సీటు ఆశీంచిన దామోదర వర్గం నేత కాట శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. శ్రీనివాస్ మొదటి నుండి కాంగ్రెస్ టికెట్ ఆశీంచి పనిచేస్తూ వచ్చారు.

నీలం మధుకు టికెట్ ఇస్తే రాజీనామా చేస్తానని దామోదర చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. ఇక నారాయణ ఖేడ్‌ నుండి సంజీవరెడ్డికి ఇవ్వాలని సూచించారు దామోదర. కానీ కాంగ్రెస్ పట్టించుకోలేదు. మాజీ మంత్రి చెన్నారెడ్డికి సైతం టికెట్ దక్కలేదు. చివరి నిమిషంలో వనపర్తి సీటును వేరే వారికి కేటాయించింది కాంగ్రెస్.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర సీనియర్ కాంగ్రెస్ నేత. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు. తర్వాత ఇదే స్థారం నుండి మరో రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -