Saturday, May 4, 2024
- Advertisement -

కూటమికి చిరు..వైసీపీకి దిల్ రాజు!

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో తలమునకలు కాగా సినీ నటులు ప్రచారం చేయకున్న ఆయా పార్టీలకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతు చేయగా తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు.

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా కోరారు దిల్ రాజు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఆరోసారి ఎమ్మెల్యేగా బాలినేనిని గెలిపించాలని…ఫలితంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఒంగోలును అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన ఘనత బాలినేనికే దక్కిందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా తన శాఖ ద్వారా ఎంతో డెవలప్‌మెంట్ చేశారు…ప్రస్తుతం జగన్ సారథ్యంలో సక్సెస్‌ ఫుల్‌గా తానెంటో నిరూపించుకున్నారన్నారు. తప్పకుండా మీ అమూల్యమైన ఓటు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వేసి గెలిపించగలరని ప్రార్థన అని తెలిపారు దిల్ రాజు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కాగా బాలినేని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. బాలినేని రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని వీడియోలో చూపించారు దిల్ రాజు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -