Thursday, May 8, 2025
- Advertisement -

సీఎం రేవంత్‌తో మాజీ డీఎస్పీ నళిని భేటీ

- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మాజీ డీఎస్పీ నళిని. 12 ఏళ్ల క్రితం తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు నళిని. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నళినికి ఉద్యోగం ఇవ్వాలని, ఒకవేళ డిపార్టుమెంట్‌లో జాయిన్ అవ్వడానికి అడ్డంకులు ఉంటే ఆమె సర్వీసుకు తగ్గ ఉద్యోగం ఇతర శాఖల్లో ఇవ్వాలని సూచించారు.

ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నళిని. అనంతరం మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందన్నారు. అయితే తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని, డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయట పడ్డానని తెలిపారు. ఇప్పుడు తనది ఆధ్యాత్మిక మార్గం, వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాననని సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు నళిని. త్వరలోనే వేదం, యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా..డిపార్ట్మెంట్‌లో ఎదుర్కొన్న సమస్యలపై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలా ఎవరూ బాధపడవద్దన్నదే నా అభిప్రాయం అని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగిన పేరు నళిని . తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. తన డీఎస్పీ కొలువునే వదిలేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -