ఏపీ ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల్లోనే కాదు ప్రజల్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుంది?, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నదానిపై అంతా దృష్టిసారించారు. ఇక జగన్ మరోసారి విజయం తనదేనని డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తానని చెబుతుండగా కూటమి నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కు కాస్త అటో, ఇటో ఫలితాలు ఉండే అవకాశం ఉండటంతో కూటమి నేతల్లో భయం పట్టుకుంది. అందుకే పోలింగ్ అనంతరం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిన నేతలంతా తమతమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు.
ఇప్పటికే చంద్రబాబు విదేశాల నుండి ఏపీకి చేరుకోగా ఎల్లుండి అమరావతికి రానున్నారు పవన్. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ 1న సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఆ ఫలితాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.