Thursday, May 8, 2025
- Advertisement -

15 ఏళ్లు జగనే సీఎం..!

- Advertisement -

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. టీడీపీ చీఫ్‌ చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీ దిక్కులేని పరిస్థితుల్లో ఉండగా వైసీపీ అధినేత, సీఎం జగన్ గ్రాఫ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు సర్వేల పేరుతో జనాల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుండగా జగన్ మాత్రం మళ్లీ వైసీపీదే అధికారం అని బల్లగుద్దిమరి చెబుతున్నారు.

ఇక ఓ వైపు సర్వేల పేరిట ఏపీలో రచ్చ జరుగుతుంటే కొంతమంది జ్యోతిష్యులు మాత్రం వచ్చే 15 ఏళ్లు జగనే సీఎం అని చెబుతున్నారు. జగన్ జాతక రిత్య ప్రస్తుత పరిస్థితులు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని ..మరో రెండు టర్మ్‌లు జగనే సీఎం అని చెబుతున్నారు.

ఇందుకు ప్రధానకారణం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలకు తోడు చంద్రబాబు అవినీతి వెరసీ వైసీపీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ ప్రధాన అస్త్రం బాబు అవినీతే. 2019లో రావాలి జగన్ – కావాలి జగన్ అనే స్లోగన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నవరత్నాలతో పాటు బాబు అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారా గెలుపు సులభమవుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ప్రధానంగా చంద్రబాబు అవినీతే టార్గెట్‌గా ఎన్నికల ప్రచారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు జగన్‌. చంద్రబాబును ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టడం ద్వారా ఆ పార్టీ ఉనికేలేకెండా చేయాలన్నదే జగన్ ప్లాన్. ఏదిఏమైనా చంద్రబాబు అరెస్ట్ ఆ పార్టీకి ప్రతికూలంగా మారగా టీడీపీ-సేన కూటమికి డూ ఆర్ డై అనే పరిస్థితి. ఇక బీజేపీ – కాంగ్రెస్ నామమాత్రపు పోటీ మాత్రమే ఇచ్చే అవకాశం ఉండగా వైసీపీ వన్‌ సైడ్ విక్టరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -