- Advertisement -
15 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు సీఎం జగన్. గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్‌కు ఘన స్వాగతం పలికారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
జగన్‌కు స్వాగతం పలికిన వారిలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ నందిగామ సురేష్‌తో పాటు సీనియర్ నేతలు ఉన్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు జగన్. ఇవాళ మధ్యాహ్నం పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక ఎన్నికల రణక్షేత్రం ముగిసిన తర్వాత మే 17న సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.