Thursday, May 8, 2025
- Advertisement -

హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు

- Advertisement -

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. మే రెండోవారం నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా సంస్థ కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠం రూ.10, గరిష్ఠం రూ.60 ఉండగా.. గరిష్ఠం రూ.75 వరకు పెరిగే అవకాశం ఉంది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నట్లు తెలిపింది L&T మెట్రో సంస్థ.

కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది L&T సంస్థ. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా పడింది. కానీ ఇప్పుడు చార్జీల పెంపు తధ్యమని L&T సంస్థ పేర్కొనగా ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో L&T మెట్రో సంస్థ ఉంది. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు చేయగా మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేసింది సంస్థ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -