Thursday, May 8, 2025
- Advertisement -

హైడ్రా..మరింత దూకుడు!

- Advertisement -

హైడ్రా..ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బఫర్ జోన్‌లు, ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరఢా ఝుళిపిస్తోంది హైడ్రా. ఇందులో భాగంగా ఇప్పటివరు 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు వెల్లడించింది. ఇక హైడ్రాకు త్వరలో మరిన్ని అధికారులను ఇవ్వనుండగా సిబ్బంది సంఖ్యను సైతం పెంచింది ప్రభుత్వం.

హైడ్రా ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా రాజేంద్రనగర్ -45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపింది.
అత్యధికంగా అమీన్ పూర్ లో 51 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం అని నివేదికలో వెల్లడించింది. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, గగన్ పహాడ్ అప్పా చెరువులు 14, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13, మాదాపూర్ సున్నం చెరువులో 42 అక్రమ నిర్మాణాలను తొలగించాం అని పేర్కొంది.

హైడ్రాకు పీవీ రంగనాథ్ కమిషనర్ గా వ్యవహరిస్తుండగా 15 మంది సీఐ స్థాయి అధికారులను, 8 మంది ఎస్సై స్థాయి అధికారులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రిలీజయ్యాయి. దీంతో త్వరలో కూల్చివేతల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలను క్రమబద్ధం చేసే ప్రసక్తే లేదన్నారు. ఆక్రమణదారులు స్వచ్చందంగా వైదొలగాలని పిలుపునిచ్చారు. అవసరమైన పక్షంలో ఆక్రమణ దారులను జైలుకు పంపేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -