చింతమనేని ప్రభాకర్..ఏపీ రాజకీయాల్లో తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు లేదా రౌడీయిజంతో వార్తల్లో నిలుస్తారు. చింతమనేని అంటేనే కేసులు అనే స్థాయికి రాజకీయం వెళ్లింది. కానీ గత ఎన్నికల్లో చింతమనేని కోటకు బీటలు వారించారు అబ్బయ్య చౌదరి.
ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా విజయం ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. 2019 ఎన్నికల్లో లక్ష 86 వేల 443 మంది ఓటు హక్కు వినియోగించుకుంటే ఈసారి ఎన్నికల్లో 2,24,013 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.
రెండవసారి కూడా చింతమనేని ప్రభాకర్ ను ఓడించాలని లక్ష్యంతో పనిచేశారు అబ్బయ్య చౌదరి. దెందలూరు అంటే కేవలం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనే పేరు నుంచి ప్రశాంతమైన ప్రాంతంగా ఉంచే ప్రయత్నాలు చేశారు. అంతేగాదు అభివృద్ధిలో తనమార్క్ స్పష్టంగా చూపించారు. ఇక చింతమనేని తన స్టైలే గెలుపుకు దోహదపడుతుందని భావించగా ఈసారి విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.