- Advertisement -

విజయ్ బాటలో చంద్రబాబు?

- Advertisement -

తమిళ రాజకీయాల్లో సెన్సేషన్‌గా మారారు టీవీకే అధినేత, సీఎం విజయ్. పాలనలో తనదైన శైలీలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతున్నారు. సాధారణ ప్రజలతో సీఎం కాన్వాయ్.. పాఠశాలలో సమీపంలో వైన్స్ శాప్‌ల ఎత్తివేత, ఫీజుల నియంత్రణపై కఠిన చట్టం తెచ్చారు.

తమిళనాడులో ద్రావిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను కాదని ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ పార్టీకి పట్టంకట్టారు ప్రజలు. విజయ్ తన పార్టీ నిర్మాణంలో సాంప్రదాయ రాజకీయ నాయకుల కంటే యువతకు ముఖ్యంగా కొత్తవారికి అవకాశం కల్పించారు. అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ ఇదే వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తోంది. నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పాత తరం నేతల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితులలో వైఎస్ జగన్ లాంటి నేతలను ఢీకొట్టాలంటే అభివృద్ధి. వృద్ధి రేటుతో పాటు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సరికొత్త పంథాను అనుసరించాల్సి ఉంటుంది.

ఇక చంద్రబాబు ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చారు. ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయలేదు. అయితే విజయ్ మాత్రం దశాబ్దాల ద్రావిడ పార్టీల కంచుకోటలకు గండికొడుతూ ఒంటరిగా పోటీ చేసి ప్రజల మనసు గెలుచుకున్నారు. మరి టీవీకే బాటలోనే చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సాహసం చేస్తారా లేక పొత్తులపై ఆధారపడతారా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -