సూపర్ సిక్స్ పేరుతో ఏపీలో అధికారంలోకి వచ్చింది టీడీపీ కూటమి. అయితే అధికారంలోకి వచ్చినా ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని చంద్రబాబుకు అర్థమై పోయింది. అసెంబ్లీ సాక్షిగా ఏపీ ఆర్థిక పరిస్థితి బాలేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ సిక్స్ స్కీంలు సాధ్యం కావని ఇది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని వ్యాఖ్యానించారు.
అయితే ఇదంతా పైకి చెప్పుకోవడానిక బాగనే ఉన్నా బాబు అంటే భరోసా అని ఇంతవరకు చెప్పిన టీడీపీ నేతలకు ప్రజల నుండి ప్రశ్నలు తప్పేలా కనిపించడం లేదు. అలా అని ట్యాక్సులు, కరెంట్ ఛార్జీలు పెంచితే ప్రజలు చంద్రబాబును విశ్వసించరు. ఈ ఆగస్టు 1 నుండి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు పాలిట శాపంగా ఆమరింది.
నెలనెలా పెన్షన్లు సమయానికి అందించాలి అది నాలుగువేలు. దీనికి తోడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, నిరుద్యోగ భృతి ఆగస్టు నుండే అమలు చేస్తామని చెప్పారు. అంతకంటే ఎక్కువగా ఆగస్టు ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్ అయినవారికి ఇవ్వాల్సిన గ్రాడ్యుటీ, పెన్షన్ ఇవ్వాలి. వీటన్నింటికి నిధులు ఎక్కడి నుండి తేవాలన్నది చంద్రబాబుకు పెద్ద టాస్క్.
వాస్తవానికి ఎన్నికల ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చినప్పుడే ఇవి సాధ్యం కావనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది. ఇప్పుడు ఇదే ఆచరణలో కనబడుతోంది. దీంతో టీడీపీ అధినేత ఆగస్టు గండాన్ని ఎలా ఎదుర్కొంటారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి టీడీపీకి ఆగస్టు సంక్షోభాలు కొత్తకాదు. ఆగస్టు అంటేనే ఆ పార్టీకి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. మరి చంద్రబాబు ఆగస్టు నుండే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారా వేచిచూడాలి.