తెలంగాణ సీఎంగా తనదైన శైలీలో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి తన మార్క్ స్పష్టంగా చూపిస్తున్నారు రేవంత్. తన కోరిక నెరవేరడంతో త్వరలోనే దేవాలయాల సందర్శనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకోగా త్వరలోనే విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శంచుకోనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక తిరుమల శ్రీవారిని పీసీసీ చీఫ్ హోదాలో దర్శించుకోగా కనకదుర్గమ్మను సీఎం హోదాలో దర్శించుకోనున్నారు రేవంత్. ఇక విజయవాడ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్‌తో రేవంత్ భేటీ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనకు విషెస్ తెలిపారు జగన్. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు జగన్. దీనికి రేవంత్ సైతం పాజిటివ్ రిప్లై ఇచ్చారు.
ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు కావోస్తుండటం, మరో ఆరు నెలల వ్యవధిలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి కూడా ముగియనుండటంతో ఇద్దరు తెలుగు సీఎంలు భేటీ కానున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.