ఆంధ్రా ఆక్టోపస్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు అడ్డుకున్న నేత లగడపాటి రాజగోపాల్. రెండు సార్లు కాంగ్రెస్ నుండి ఎంపీగా గెలిచిన రాజగోపాల్ ..ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రేని వాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఏపీ విడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించి చెప్పినట్లుగానే రాష్ట్ర విభజన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుండి తప్పుకున్నాడు.
అయితే అనూహ్యంగా కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో లగడపాటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రానున్నాడని ప్రచారం జరుగగా ఇందుకు తగ్గట్టుగానే తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో తిరిగి లగడపాటి విజయవాడ ఎంపీగా బరిలోకి దిగనున్నారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన రాజగోపాల్ మాత్రం స్పందించలేదు.
దీంతో లగడపాటి పొలిటికల్ ఎంట్రీ పుకార్లకు చెక్ పడగా తాజాగా మళ్లీ ఇప్పుడు ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేశినేని బ్రదర్స్ మధ్య విజయవాడ ఎంపీ సీటు విషయంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో లగడపాటి అనుచరులు మళ్లీ ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే లగడపాటి ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోయినా కొంతమంది నేతలు మాత్ర్ లగడపాటి టీడీపీలో చేరుతారని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా ప్రచారమేనా లేక లగడపాటి నిజంగానే రీ ఎంట్రీ ఇస్తారా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.