టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, జైలును నిరసిస్తూ వివిధ రూపాల్లో ఆందోళన చేస్తోంది టీడీపీ. ఏపీ వ్యాప్తంగా రోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రజల నుండి అంత స్పందన రావడం లేదు. ఈ క్రమంలో టీడీపీ ఆందోళనల్లో బాలకృష్ణతో పాటు బ్రహ్మాణి,భువనేశ్వరి కూడా పాల్గొనేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ సింపతిని క్యాష్ చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు చేయని ప్రయత్నాలు లేవు.
తాజాగా ఐటీ ఉద్యోగులను రంగంలోకి దించారు. చంద్రబాబు తన కెరీర్‌లో ఎప్పుడు చెప్పుకునేది ఐటీని అభివృద్ధి చేసింది తానేనని. హైదరాబాద్‌కు ఐటీని తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి బాటలు వేసింది బాబే కావొచ్చు. దీనిని బ్రాండ్‌గా ప్రమోట్ చేసేందుకు టీడీపీ నేతలు ఐటీ ఉద్యోగులను రంగంలోకి దించి వారితో ధర్నా చేయించే కార్యక్రమానికి తెరలేపారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ సరైంది కాదని నిరసన తెలుపుతున్నారు. కానీ ఐటీ ఉద్యోగులు అర్ధం చేసుకోవాల్సింది…చంద్రబాబే కాదు ఏ నాయకుడైనా మంచి చేస్తే మంచే..చెడు చేస్తే చెడే. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి ఆయనేదో దేవుడు అంటూ ప్రొజెక్టు చేయడం సబబు కాదనే వాదన వినిపిస్తోంది.
దేశంలో ఎంతోమంది నాయకులు ఎన్నో అద్భుతాలు సృష్టించారు…అందులో కొంతమంది నేతలకు అవినీతి మరకలంటి జైలు పాలయ్యారు. కానీ వారెవరూ మరీ ఇంత చీప్‌గా ప్రవర్తించలేదు. ఒక్క చంద్రబాబు విషయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల ధర్నా వెనుక ఉంది టీడీపీ ఐటీ సెల్ విభాగమేనని జగమెరిగిన సత్యం. అందుకే ఐటీ ఉద్యోగుల ధర్నా పేరుతో ఎన్ని కుప్పిగంతులు వేసినా లాభం మాత్రం శూన్యం. ఇక మొత్తం ఎపిసోడ్‌లో హైలైట్ ఏంటంటే నారా లోకేష్ స్పందన. ఢిల్లీలో ఉన్న లోకేష్…ఇదంతా తనకు తెలియదన్నట్టు ఐటీ ఉద్యోగులకు అభినందనలు చెప్పడం ఆ పార్టీ నేతలకే నవ్వు తెప్పిస్తోంది.