- Advertisement -

కాఫీ కోసం నేను చచ్చిపోతా..నెతన్యాహు చమత్కారం!

- Advertisement -

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మరణించారన్న వదంతులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆయన స్వయంగా వీడియో విడుదల చేసి స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేసిన ఆ వీడియోలో నెటాన్యాహు కాఫీ తాగుతూ కనిపించారు. “I am dead for coffee…” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ తన మరణ వార్తలపై చమత్కారంగా స్పందించారు.

ఇటీవల సోషల్ మీడియాలో నెతన్యాహు మరణించారనే వార్తలు వేగంగా వైరల్ అయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన ప్రధాని కార్యాలయం ఆ వార్తలను పూర్తిగా ఖండించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారు, ఆ వార్తలు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.

అదేవిధంగా నెటాన్యాహు తన భద్రత గురించి ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేశారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో కనిపించింది. అయితే ఫ్యాక్ట్ చెకర్లు, అలాగే ఎక్స్‌లోని AI చాట్‌బాట్ Grok ఈ ప్రచారాన్ని ఖండించాయి. నెటాన్యాహు ఖాతా నుంచి అలాంటి ట్వీట్ ఏదీ తొలగించబడలేదని, ఇటీవల వచ్చిన పోస్టు జాతీయ భద్రతా మండలి ప్రకటనకు సంబంధించినదేనని వెల్లడించాయి.

వైరల్ అయిన వీడియోలో నెటాన్యాహు చేతిలో అదనంగా ఒక వేళ్లు కనిపించిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై కూడా గ్రోక్ స్పందిస్తూ అది కేవలం విజువల్ ఇల్యూషన్ మాత్రమేనని, వీడియోను ఎడిట్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అలాగే ఆయన మరణించారనే వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని కూడా తెలిపింది.

ఇంకా మరో కారణంగా కూడా ఈ వదంతులు మరింత పెరిగాయి. నెతన్యాహు కుమారుడు యామిర్ నెతన్యాహు కొన్ని రోజులుగా ఎక్స్‌లో పోస్టులు చేయకపోవడం వల్ల కుటుంబంలో ఏదైనా విషాదం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. ప్రధాని కార్యాలయం మళ్లీ స్పష్టం చేస్తూ నెటాన్యాహు సురక్షితంగా ఉన్నారని, తన అధికారిక బాధ్యతలను కొనసాగిస్తున్నారని పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -