- Advertisement -
ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పులివెందుల భాకరాపురంలోని జయమ్మకాలనీ 138వ పోలింగ్ సెంటర్ వద్ద ఓటు వేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు.ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
కుప్పంలో చంద్రబాబు దంపతులు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ అభ్యర్థి వై.ఎస్. షర్మిల ఇడుపులపాయలో ఓటు వేశారు. భర్త అనిల్ కుమార్ తో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ చెదురుమదరు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో ఉదయం 9గంటల వరకు 12శాతం ఓటింగ్ నమోదైంది.
పిఠాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు వైసీపీ అభ్యర్థి వంగా గీత. జనసేన అధినేత పవన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.