వైసీపీ అభ్యర్థులతో మాజీ సీఎం జగన్ ఈ నెల 20న భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఆలస్యంగా వెలుగులోకి రాగా హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామని అనిపించిందని…షాక్‌లో నుంచి బయటకు రావడానికి రెండు మూడు రోజులకు పైనే సమయం పట్టిందని చెప్పినట్లు తెలుస్తోంది. 2029లో అధికారంలోకి రాబోయేది మనమేనని చెప్పారు జగన్.
చాలా కాన్ఫిడెంట్‌గా ఎన్నికలకు వెళ్లామని కానీ ఫలితాలు మాత్రం డిఫరెంట్‌గా వచ్చాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల నుండి బయటకు వచ్చి..ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కావాలని సూచించినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు మనకు వచ్చాయన్న విషయం మరిచిపోవద్దని తెలిపారు. 2019తో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయని…వారే చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ఇట్టే గుర్తిస్తారని చెప్పారు. ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచి ఏంటో తెలుసుని.. మనం చేసిన మంచే మనకు శ్రీరామరక్ష అని చెప్పినట్లు తెలుస్తోంది.