Friday, May 9, 2025
- Advertisement -

వైఎస్ వల్ల కాలేదు..జగన్ సాధించాడా?

- Advertisement -

తన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఇలాంటి పరిస్ధితిని ఎప్పుడు చూసి ఉండడు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఇక బాబు పని అయిపోయింది అనే వరకు కూడా వెళ్లాయి రాజకీయ పరిణామాలు. కానీ వాటన్నింటిని ఎదుర్కొని బయటపడ్డారు చంద్రబాబు. కానీ ఇప్పుడు టోటల్ రివర్స్. తన పతనాన్ని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. ముఖ్యంగా పొలిటికల్‌గా ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకుని ఉండరు.

గంటల తరబడి సీఐడీ విచారణ జరుపుతుందని…కోర్టులో బెయిల్ కోసం ఇంతలా వేచి చూస్తానని అస్సలు భావించి ఉండరు. కానీ ఓడలు బండ్లు అవుతాయి..బండ్లు ఓడలు అవుతాయనేది ఇదే. ఎన్నో కేసుల్లో చంద్రబాబుకు క్లీన్ చీట్ వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పక్కా ఆధారాలతో సీఐడీ అధికారులు సేకరించారు. ఈ అవినీతికి కుట్రదారు చంద్రబాబేనని కోర్టుకు ఇచ్చిన ఛార్జ్ షీట్‌లో తేల్చిచెప్పారు. దీంతో చంద్రబాబు ముందున్న దారులన్ని క్లోజ్ అయ్యాయి.

గతమెంతో ఘనం అనేలా చంద్రబాబు పరిస్థితి తయారైంది. గంటల తరబడి విచారణ, బెయిల్ కోసం నిరీక్షణ జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు కూడా మింగుడు పడటం లేదు. ఇక ఆర్ధిక నేరాల్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష తప్పదు. ఈనేపథ్యంలో బాబు తరపు న్యాయవాదులు ఆయన సత్య హరిశ్చంద్రుడు అని చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

వాస్తవానికి వైఎస్ హయాంలోనే బాబు అవినీతిని నిరూపించి ఆయన్ని శ్రీకృష్ణ జన్మస్ధలానికి పంపించాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అయితే జగన్ మాత్రం ఓపిగ్గా తాను అనుకున్నది సాధించారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ వల్ల కానిది జగన్ వల్ల సాధ్యమైందని అంతా కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -