Monday, May 5, 2025
- Advertisement -

రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదు..జగన్ తీవ్ర ఆగ్రహం

- Advertisement -

ఏపీలో వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలే టార్గెట్‌గా జరుగుతున్న హింసాకాండపై ఢిల్లీలో ధర్నా చేపట్టారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు.

మీడియాతో మాట్లాడిన జగన్‌…ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించాయని, దీనిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దాడులు..దైర్జన్యాలతో పాలన సాగుతోందని …బాధితుల పైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని ..లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని తనకు నచ్చని వారి పైన కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండ్ బుక్ లో పేర్లు ఉన్నాయంటూ రాజకీయ నేతలు, అధికారులను వేధిస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలను చంపేశారని, వందల ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

పంటలు ధ్వంసం చేస్తున్నారు, ఏపీలో పరిణామాలను గమనిస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న సందేహం కలుగుతోందన్నారు. ఏపీలో పరిస్థితులను ప్రధాని, రాష్ట్రపతికి వివరించేందుకు ఢిల్లీకి వచ్చామని తెలిపారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -