పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు జాతి అందరించిపోతుందా అని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. కృష్ణా జిల్లా పామర్రులో జడనన్న విద్యా దీవెన కార్యక్రమానికి సంబంధించిన నిధులు విడుదల చేసే కార్యక్రమంలో మాట్లాడారు జగన్.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం తెస్తే చంద్రబాబు, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తుందని విమర్శించారు జగన్. ప్రభుత్వ బడులు బాగు పడాలనుకోవడం తప్పా అని ప్రశ్నించిన జగన్…విద్యారంగంలో పేదలకు ఎదగాలని మార్పు తెస్తుంటే ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. వాళ్ల పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువాలి..కానీ పేదవారు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు జాతి అంతరించిపోతుందని మూర్ఖపు వాదన తీసుకొస్తున్నారన్నారు. పెత్తం దారులకు, పేదలకు మధ్య జరిగే క్లాస్ వార్ జరుగుతోందని… విద్యా రంగంలో సంస్కరణలు తెకపోతే కూలీల పిల్లలు కూలీలుగా మిగిలిపోతారని అన్నారు.
గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించి ఓటేయాలన్నారు. విద్యా రంగంలో అనేక మార్పులు తెచ్చాం.. పిల్లలు బాగుండాలని, పేదరికం నుంచి బయటకు రావాలని పథకాలకు 73వేల కోట్లు 57నెలల్లో ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు.