Sunday, May 4, 2025
- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి జగన్‌

- Advertisement -

జూన్ 4న ఏపీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం షాక్ అవ్వబోతుందన్నారు సీఎం జగన్. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి రాబోతున్నామని తేల్చిచెప్పారు.

2019 కంటే 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రానున్నాయని అలాగే 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికంటే వైసిపికి ఎక్కువ సీట్లు వస్తాయపి, ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం అని స్పష్టం చేశారు.

ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని…రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని త్వరలో మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఈ సందర్భంగా పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -