ఏపీలో గెలిచేది సీఎం జగనేనని తేల్చి చెప్పారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఈ ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని, జగన్ మళ్లీ సీఎం అవుతారని తేల్చిచెప్పారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్..రానున్న రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తారని విశ్వాసం వ్యకం చేశారు.
జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం విశఖలోనే ఉంటుందన్నారు. ఐదేళ్లుగా ప్రతి పేదవాడికి సీఎం జగన్ అండగా నిలబడ్డారని.. మళ్లీ ఆయనే సీఎం అయితేనే తమకు మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. గతంలో కంటే వైఎస్ఆర్సీపీకి ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.
ప్రతిపక్షాలు చేసిన గొడవకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని…. కేంద్రానికి మన ఎంపీల అవసరం పడాలన్నారు.కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. మా మద్దతు వారికి అవసరమయ్యేలా ఉండాలని…అప్పుడే ఏపీకి ఇచ్చిన హామీలన్ని నెరవేరుతాయన్నారు.