Monday, May 5, 2025
- Advertisement -

జనసేన కాదు చంద్రసేన?

- Advertisement -

జనసేనాని పవన్…చంద్రబాబు దత్తపుత్రుడా..?బాబు అరెస్ట్ తర్వాత టీడీపీ – జనసేన మధ్య ఏం జరుగుతోంది…?తానే ముఖ్యమంత్రినని పవన్ ప్రకటించడం వెనుక అంతర్యమేంటీ..?జనసేన పూర్తిగా చంద్రసేనగా మారిపోయింది అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్‌లో పూర్తిగా మార్పు వచ్చింది. టీడీపీని పూర్తిగా తన సొంతపార్టీలా భావిస్తున్నారు పవన్‌. అందుకే వచ్చేది సంకీర్ణ సర్కార్‌ అని పదేపదే చెబుతున్నారు. అలాగే టీడీపీ ప్రస్తుతం వీక్‌గా ఉందని అందుకే తాము మద్దతిచ్చామని చెబుతున్నారు. సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు కూడా. అయితే పవన్‌ ఇంతలా రెచ్చిపోతున్న టీడీపీ నేతల నుండి ఎలాంటి స్పందన లేదు. దీనంతటికి కారణం ఇకపై జనసేన – టీడీపీ ఒక్కటి కావడం ఖాయం. అంటే ఇకపై జనసేన కాదు అది చంద్రసేన అని టీడీపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీడీపీతో పొత్తులో ఎక్కువ స్ధానాలను ఆశిస్తున్నారు పవన్‌. అలాగే జనసేన – టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలోనూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్‌ దూకుడు పెంచారు. అంటే ఓ విధంగా చెప్పాలంటే చంద్రసేనగా మారి టీడీపీ నేతలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. టీడీపీ నేతలు సైతం పవన్‌ దర్శనం కోసం క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరుగుతుందా లేదా పవన్‌ తనకు తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని ప్రొజెక్టు చేసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -