కల్లు గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచం తీసుకువస్తామని చెప్పారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని గవర్నర్ తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు
బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలుకు కృషి చేస్తామని తెలిపారు. రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశాం… రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నాం అన్నారు. శాస్త్రీయంగా కులగణన చేశాం అన్నారు.
పరిశ్రమలు, సర్వీసు రంగాలను ప్రోత్సహిస్తున్నాం అని తెలిపిన గవర్నర్.. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందని… వరి రైతులకు రూ,500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం అని… 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపడతామని… ఆరోగ్య పరిమితిని రూ.10లక్షలకు పెంచాం అన్నారు.