Saturday, May 3, 2025
- Advertisement -

ప్రతిరోజూ అసెంబ్లీకి హాజరుకండి..ఎమ్మెల్యేలతో కేసీఆర్

- Advertisement -

12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. తొలిరోజు గవర్నర్ స్పీచ్ ఉండనుండగా ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు మాజీ సీఎం కేసీఆర్.

ప్రతిరోజూ అసెంబ్లీకి తప్పకుండా హాజరు కావాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. పదేళ్లలో బీఆర్ఎస్ నాలుగు లక్షల కోట్ల అప్పు చేస్తే.. కాంగ్రెస్ 14 నెలల్లోనే లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలన పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడుస్తోంది. కానీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా అభివృద్ధి, సంక్షేమం విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. అప్పుల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకుండా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్ వాపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -