- Advertisement -

కొత్త యూనిఫాంలు.. విద్యాసంవత్సరం నుండే!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త యూనిఫామ్‌లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ అకాడమిక్ ఇయర్ జూన్ 12 నుంచి ప్రారంభంకానుండగా, విద్యార్థులకు కొత్త దుస్తులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు.

ఏ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం రూపొందించినట్లు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్‌లో భాగంగా స్టూడెంట్లకు కూటమి ప్రభుత్వం యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ అందించనుంది.ర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌లో.. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్స్, డిక్షనరీ, బెల్ట్, షూలు, బ్యాగ్, మూడు జతల యూనిఫామ్ ఉంటాయి.

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్‌లో యూనిఫామ్, బెల్టులు, బ్యాగ్‌లు అందించనున్నారు. బెల్టులపై గతంలో విద్యాకానుక అని రాయగా.. ఈసారి ప్రత్యేకంగా రూపొందించిన లోగోను ముద్రించనున్నారు. అలాగే లేత ఆకుపచ్చ రంగులో స్కూలు బ్యాగులు ఉండనున్నాయి. ఈ కిట్లను జూన్‌ 12 నాటికి పాఠశాలలు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -