Thursday, May 8, 2025
- Advertisement -

సీఎం జగన్‌తో కేశినేని నాని భేటీ

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని …సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలుపొందారు నాని. స్థానికంగా ఆయనకు మంచి పట్టు ఉంది. అయితే కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో గ్యాప్ ఏర్పడటంతో టీడీపికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయన కూతురు శ్వేత టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా సీఎం జగన్‌తో భేటీ అయ్యారు నాని. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ కాగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నాని వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండగా ఆ వార్తలకు నిజం చేకూరేలా వీరిద్దరి భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది.

నిన్నటివరకూ చంద్రబాబు, కేశినేని నాని, కేశినేని శ్వేత ఫ్లెక్సీలతో పసుపుమయంగా ఉన్న విజయవాడ ఎంపీ కార్యాలయం పూర్తిగా మారిపోయింది. పసుపు ఫ్లెక్సీలు తొలగించేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ తరపున ఆయన విజయవాడ ఎంపీగా నాని పోటీ చేస్తారని తెలుస్తోంది. నానితో పాటు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్ కూడా వైసీపీలో చేరే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -