Tuesday, May 6, 2025
- Advertisement -

పీకే ఎంట్రీ..కొడాలి మార్క్ పంచ్!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని రంగంలోకి దించారు. దీనిపై వైసీపీ నేతలు తమదైన శైలీలో స్పందిస్తుండగా మాజీ మంత్రి కొడాలి నాని సైతం సెటైర్లు వేశారు.

పీకేను చంద్రబాబు కలిస్తే భూమి బద్దలైపోదని..తాము ప్రశాంత్‌ని పూర్తిగా వాడేశామన్నారు. పీకే బుర్రలో ఉన్న గుజ్జంతా అయిపోయిందని ఇప్పుడు ఆయన నుండి ఏం కాదన్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే వివేకాను చంపి, కోడికత్తి డ్రామాలు ఆడారని ఎల్లో మీడియా అప్పట్లో గగ్గోలు పెట్టిందని.. మరిప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటారా అని కౌంటర్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్, టీడీపీ శ్రేణులపై చంద్రబాబు నమ్మకం కోల్పోయారనీ, అందుకే ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి సిగ్గు,శరం,మానాభిమానాలు ఏవీ లేవని, ఆయన చర్యలు చూస్తేనే అర్థమవుతుందన్నారు. గతంలో ప్రశాంత్ కిశోర్ గురించి చంద్రబాబు, లోకేశ్ లు ఏం మాట్లాడారో గుర్తుకు చేసుకోవాలనీ, బీహారోడు ఇక్కడికొచ్చి ఏం పీకుతాడనీ, బీహారోడి ఆట కట్టు, తోలు తీస్తామని వ్యాఖ్యానించారని గుర్తుకు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -