అందాల పోటీల్లో పాల్గొంటున్న వారి వరంగల్ పర్యటన కోసం పేదల ఇళ్లు కూల్చుతున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ అరాచక కాంగ్రెస్ విధానంపై రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు.
రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. హలో రాహుల్ గాంధీ, బుల్డోజర్ కంపెనీలతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉన్నదా? , ప్రతిరోజూ పేదల ఇళ్లతో పాటు వారి జీవితాలపై దాడి చేయడం ఏమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.
వరంగల్‌లో దారివెంట ఇళ్ల ధ్వంసంపై కేటీఆర్ మండిపడ్డారు. అందాల పోటీల కోసం పేదవారి ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలననా?, రూ. 200 కోట్ల ప్రజా సొమ్ము ఖర్చుపెట్టి రాజ భవనాల్లో విందులు పెట్టడం ప్రజాపాలనా? చెప్పాలన్నారు. పేద ప్రజల జీవితాలు రాక్షస బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయి.. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్న సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.