ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఉభయ సభలను ఎద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండగా ఇక వైసీపీకి ఓ రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏపీ శాషనమండలిలో ప్రతిపక్షనేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గుర్తిస్తూ ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
కొంతకాలంగా అసెంబ్లీలో ప్రతిపక్షనేత హోదా ఇవ్వాలని టీడీపీ – వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాయగా ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ తేల్చిచెప్పారు.
ఇక ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైన సభ్యులకు స్పీకర్ సీట్ల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో సభ్యులు తమకు నచ్చిన చోట కూర్చుంటున్నారు. అందుకే మాజీ సీఎం జగన్ పక్కన కూర్చున్నారు రఘురామ కృష్ణంరాజు. చెవిలో ఏదో చెప్పబోతుండగా జగన్ సీరియస్ అయ్యారు కూడా.
అయితే మండలిలో మాత్రం వైసీపీకి ఈ సమస్య లేదు. ప్రతిపక్ష నేతగా అప్పిరెడ్డిని గుర్తించడంలో ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకు మార్గం సుగుమమైంది.
అసెంబ్లీలో ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక ఇవాళ ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి హాజరయ్యారు జగన్.