Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్‌ అరెస్ట్..ఇప్పుడు ఇదే హాట్ టాపిక్?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ కు సంబంధించిన వార్తే హాట్ టాపిక్‌గా మారింది. ఫైబర్ నెట్ వర్క్ స్కాంలో లోకేష్ పాత్ర ఉందని ప్రాధమికంగా అంచనాకు వచ్చామని త్వరలోనే ఆయన్ని విచారిస్తామని సీఐడీ అధికారులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసులో చంద్రబాబును ఏ1గా చేర్చడంతో లోకేష్, అచ్చెన్నాయుడుల పేర్లు చేర్చారు సీఐడీ అధికారులు. ఈ కేసులో బాబును విచారించేందుకు 5 రోజుల కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై న్యాయస్ధానం త్వరలో తీర్పు వెలువరించనుంది.

ఇక ఇదే కేసులో నారా లోకేష్‌ని విచారించేందుకు సీఐడీ అధికారులు సిద్ధం కావడంతో లోకేష్ అరెస్ట్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే దానిపై ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. లోకేష్‌ని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీకి చెందిన ఒక టీం ఇప్పటికే ఢిల్లీకి వెళ్లినట్లుగా ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్ ఇద్దరు అరెస్ట్ అయితే ఏపీ రాజకీయాలు మరింత వేడిని రాజేసే అవకాశాలుంటాయి.

చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకు ఆయన తరపు న్యాయవాదులు చేస్తున్న పోరాటం ఫలించడం లేదు. పేరు మోసిన లాయర్లు వచ్చినా బాబుకు బెయిల్ దొరకని పరిస్ధితి. దీంతో చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారనేది ప్రశ్నగానే మారింది. తాజాగా ఇప్పుడు లోకేష్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాయకత్వ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు బ్రాహ్మణి. ఏదిఏమైనా చంద్రబాబు,లోకేష్‌లకు బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పాల్సిన పరిస్ధితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -