మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా అక్టోబర్ 22న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేది అక్టోబర్ 29 కాగా నవంబర్ 4 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేది. స్క్రూటినీ అక్టోబర్ 30న ఉండనుండగా నవంబర్ 20న ఎన్నికలు , 23న ఫలితాలు రిలీజ్ కానున్నాయి.
ఝార్ఖండ్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 13న తొలి దశ, నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఝార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా నవంబర్ 23న ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

ఈ రెండు రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లో 48 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల బైపోల్ షెడ్యూల్ నూ కూడా ప్రకటించింది ఈసీ. 48 అసెంబ్లీ, వయనాడ్ ఎంపీ సెగ్మెంట్ కు 13న, కేదార్ నాథ్ ఎంపీ సీటుకు 20 న ఓటింగ్ ఉంటుంది. వీటన్నింటి ఓట్ల లెక్కింపు నవంబర్ 23న ఉంటుంది.
