శివసేన 2.0 షిండేలకు సీన్ సీతారే ?

ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంపై ప్రయోగించిన ఏక్ నాథ్ షిండే ఆపరేషన్ విజయవంతంగా అమలు చేసింది బీజేపీ. దాంతో ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం నెలకొరిగి షిండే ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ అధిష్టానం. దాంతో బీజేపీకి ప్రతికూల పార్టీలతో పాటు అనుకూల పార్టీలలో కూడా గుబులు ఏర్పడింది. ఎందుకంటే బీజేపీ పరిధిని పెంచుకునేందుకు మోడీ-షా ద్వయం వేస్తున్న ప్రణాళికలలో షిండే ప్రయోగం ఆయా రాష్ట్రాలలో కూడా ప్రయోగించాలని చూస్తోంది. ఇది విషయాన్ని కమలనాథులు పలు సందర్భాలలో.. “చాలా రాష్ట్రాలలో షిండేలు పుట్టుకొస్తారు” అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం.

సరే ఈ విషయాన్ని అలా ఉంచితే ఏక్ నాథ్ షిండే ద్వారా శివసేన లో చీలిక తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి కొత్త చిక్కులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే శివసేన ఎవరిది అనే దానిపై ఉద్దవ్ థాక్రే మరియు ఏక్ నాథ్ షిండే లు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. అయితే ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం లో ఉన్న 50 ఎమ్మెల్యేలతో పాటు 12 మంది ఎంపీలు బీజేపీ ఆపరేషన్ లో భాగమైన ఏక్ నాథ్ షిండే పక్షాన చేరడంతో షిండే తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. కానీ మొదటి నుంచి కూడా ఉద్దవ్ థాక్రే నాయకత్వంలో నడిచిన శివసేన కార్యకర్తలు..పార్టీని చీల్చిన ఏక్ నాథ్ షిండే తో కలిసి నడిచేందుకు ముందుకు రావడం లేదనే వాదనలు వినపడుతున్నాయి. అంతే కాకుండా షిండే పక్షాన చేరిన కొందరు ఎమ్మెల్యేలకు పదవులు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దాంతో వాళ్ళు ఎప్పుడైనా షిండేపై వ్యతిరేక భావుట ఎగురవేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా పోయిన చోటే వెత్తుకోవాలి అన్నట్లుగా శివసేన లో ఏర్పడ్డ ఈ అనిశ్చితి రూపు మాపేందుకు ఉద్దవ్ థాక్రే కుమారులు ఆదిత్య థాక్రే మరియు తేజస్ థాక్రే రంగంలోకి దిగడంతో పోలిటికల్ హిట్ మరింత పెరిగింది. ఎందుకంటే ఆదిత్య థాక్రే, మరియు తేజస్ థాక్రే ద్వారా శివ సేనకు పెద్ద ఎత్తున యూత్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇది సహజంగానే ఏక్ నాథ్ షిండే పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో క్రెత్ర స్థాయిలో ఏక్ నాథ్ షిండే పై శివసేన కార్య కర్తల నుంచి పార్టీ ని చీల్చడానే వ్యతిరేకతకు ఉద్దవ్ థాక్రే కుమారులు గట్టిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. దాంతో కార్యకర్తల బలం కోల్పోయిందుకు ఇష్టం లేని షిండే పక్షాన చేరిన ఎమ్మేల్యేలు.. తిరిగి ఉద్దవ్ థాక్రే పక్షన చేరిన ఆశ్చర్యపోనవసరం లేదు. నిజంగా ఇలా జరిగితే షిండే ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.

Also Read

జగన్.. గాల్లో మేడలు కడుతున్నాడా ?

మోడీ టార్గెట్ ఎవరు..?

జనసేనాని దారిలో చంద్రబాబు ?

Related Articles

Most Populer

Recent Posts