Friday, May 9, 2025
- Advertisement -

జగన్‌ సొంత చెల్లిలా చూసుకున్నారు:ఎమ్మెల్యే పద్మావతి

- Advertisement -

తనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. సీఎం జగన్ తనను సొంతం చెల్లిలా చూసుకున్నారని, టీడీపీ నేతలే అసలు విషయం తెలుసుకోకుండా అనవసర రాద్దారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు జగన్ తోనే అని తేల్చిచెప్పిన పద్మావతి.. జిల్లా స్థాయిలో అవ్వాల్సిన పనులు సీఎం ఆఫీస్ వరకూ వెళ్లాల్సి వస్తుందని బాధ తప్ప ఏమీ లేదు అన్నారు.

ప్రతిసారీ తాడేపల్లికి రావాల్సి వస్తుందని ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడానని..తనకు మంత్రి అయిపోవాలనే ఆలోచన లేదన్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. తాను అధికారులను ఉద్దేశించి అన్న మాటలను జగన్ కు ఆపాదించి.. ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు కూడా ఒత్తిళ్లకు లోనవుతున్నారని… నా నియోజకవర్గ ప్రయోజనాల కోసం నేను కూడా పోరాడుతున్నా. ప్రతీసారి సీఎం ఆఫీసుకి వెళ్లాల్సి వస్తోంది అనే బాధతోనే ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడాను వేరే ఉద్దేశం లేదన్నారు. నేను అన్న మాటలను వక్రీకరించి… జగన్ ను వ్యతిరేకించినట్లు, పార్టీని వదిలిపోతున్నట్లు చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -