Wednesday, May 7, 2025
- Advertisement -

చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఎంపీ కేశినేని నాని. తనది, జగన్‌ది ఒకే భావజాలం అని చెప్పిన నాని..ముక్కు సూటితనంగా ఉంటామని చెప్పారు. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి నిజమైన అంబేద్కర్ వాదిగా సీఎం జగన్ నిలిచారని కొనియాడారు.

చంద్రబాబు రాజకీయ సమాధికి పునాది తిరువూరులోనే పడిందన్నారు. తిరువూరులో నాపైకి లోకేష్ గుండాలను పంపాడని, చంద్రబాబు కోసం తాను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు అన్నారు. సీఎం జగన్‌ పేదవాడిని ధనికుడిని చేశారన్నారు. చంద్రబాబుకు రోడ్లు కావాలి, ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలి తప్ప పేదవాడి గోస పట్టదన్నారు.

లోకేష్ కోసమే చంద్రబాబు అమరావతిని నిర్మించాడని, విజయవాడ అభివృద్ధికి రూ.100 కోట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. త్వరలోనే కట్టలేరు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.

టీడీపీకి రాజీనామా చేసిన నాని…వైసీపీలో చేరగా ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ కన్ఫామ్ చేశారు జగన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -