- Advertisement -

MSG:శశిరేఖ…సాంగ్ ప్రోమో

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ నుంచి రెండో పాట ప్రోమో విడుదలయ్యింది. ‘శశిరేఖ’ అనే టైటిల్‌తో రిలీజ్ చేసిన ఈ చిన్న ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి హంగామా క్రియేట్ చేస్తోంది. డిసెంబర్ 8న పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆ పాట ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ యూట్యూబ్, రీల్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘శశిరేఖ’ ప్రోమో కూడా అదే రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పవర్‌ఫుల్ ఎమోషన్స్ ఉండే సినిమాలో చిరంజీవి గెట్‌అప్, ఎనర్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని టాక్.

చిత్ర యూనిట్ ఇప్పటికే షూటింగ్‌ను వేగంగా ముగించేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జోరుగా కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయడానికి ఈ మెగా సినిమా సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -