ఎన్నికల ఫలితాలకు మరో నాలుగు రోజుల టైం మాత్రమే ఉంది. గెలుపు ఎవరిని వరిస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈసారి టఫ్ ఫైట్ ఉంటుంది, ఎవరు గెలిచినా మార్జిన్ సీట్లతోనే అని ప్రచారం జరుగుతోంది.
అయితే ఎన్నికల తర్వాత ఇప్పటివరకు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో పలు సంస్థలు జగనే అధికారంలోకి రాబోతున్నారని తేల్చేసింది.తాజాగా నాగన్న సర్వే సైతం జగన్‌కే జైట కొట్టింది. వైసీపీ 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలపగా టీడీపీ కూటమి 46 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది.33 స్థానాల్లో గట్టి పోటీ నెలకొనగా ఇందులో 22 వైసీపీ,3 చోట్ల టీడీపీ విజయం సాధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరో 8 చోట్ల గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పటం కష్టమని వెల్లడించింది.
ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే వైసీపీ 17,కూటమి 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని మరో 4 చోట్ల గట్టి పోటీ ఉందని తెలిపింది. వైసీపీకి 50.98 శాతం ఓట్లు వస్తాయని టీడీపీకి 39.75 శాతం, జనసేనకు 6.35 శాతం, ఇతరులకు 2.92 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది.