- Advertisement -

‘ది ప్యారడైజ్‌’ మూవీ ట్రైలర్.. నాని కీలక ప్రకటన!

- Advertisement -

హీరో నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సినిమా విశేషాలను పంచుకుంటూ, ట్రైలర్ విడుదల కాకపోవడానికి గల కారణాలను నాని స్పష్టం చేశారు.

సినిమా విడుదలకు తక్కువ సమయం ఉండటంతో ‘ది ప్యారడైజ్‌’కు ట్రైలర్‌ ఇవ్వడం సాధ్యం కాలేదని నాని తెలిపారు. తమకు ట్రైలర్ కంటే సినిమా నాణ్యతే ముఖ్యమని స్పష్టం చేశారు. అద్భుతమైన ట్రైలర్ ఇవ్వాలంటే దర్శకుడు శ్రీకాంత్, సంగీత దర్శకుడు అనిరుధ్ మరింత సమయం కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

తాను ఎప్పుడూ ఒకే ట్రెండ్‌ను ఫాలో కాలేదని నాని అన్నారు. ‘దసరా’ తర్వాత ‘హాయ్‌ నాన్న’, ఆ తర్వాత ‘హిట్‌-3’, ఇప్పుడు ‘ప్యారడైజ్‌’ చేస్తున్నానని చెప్పారు. తన తర్వాతి సినిమా ప్రకటన వస్తే తాను పక్కదారి పట్టలేదనే స్పష్టత అందరికీ వస్తుందని తెలిపారు. ఇక ‘దసరా’, ‘ప్యారడైజ్‌’ పాటలు హిట్ కావడానికి సంగీత దర్శకులతో పాటు దర్శకుడు శ్రీకాంత్ టేస్టే కారణమని కొనియాడారు. ఏ పాటను ఎవరితో పాడించాలో శ్రీకాంత్‌కు బాగా తెలుసని చెప్పారు.

దర్శకుడు శ్రీకాంత్ సినిమాపై ఉండే పిచ్చితోనే ఈ కథను తెరకెక్కించారని నాని తెలిపారు. సినిమాలో తన లుక్, టాటూ గురించి ఎప్పుడూ సంకోచించలేదన్నారు. ఒక దర్శకుడు అందరికీ నచ్చేలా సినిమాలు తీయాలని కోరుకోవడం కరెక్ట్ కాదన్నారు. శ్రీకాంత్ చాలా మంచితనం ఉన్న మొండివాడని, తన తప్పును ఒప్పుకోవడానికి ఎప్పుడూ వెనుకాడడని చెప్పారు.

ఈ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటించారు. ఆయనతో పనిచేయడం ఎంతో అద్భుతమైన అనుభూతినిచ్చిందని నాని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేస్తే ఎవరైనా సరే ఆయన ప్రేమలో పడిపోతారని, ఆయనలో ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం ఉంటుందని ప్రశంసించారు. షూటింగ్‌లో తనకు, తోటి నటీనటులకు కొన్ని గాయాలయ్యాయని, అయితే ఇవన్నీ సినిమా కోసం పడ్డ కష్టాలేనని నాని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -