- Advertisement -
ఏపీ మంత్రి,టీడీపీ నేత నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు నారా లోకేష్. మంగళగిరి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా తన వాట్సాప్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు లోకేష్.
పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన రావడంతో ఆయన వాట్సాప్ ఖాతా స్తంభించింది. ఎక్స్ ద్వారా స్పందించిన లోకేష్.. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి తన వాట్సప్ ను మెటా బ్లాక్ చేసిందని లోకేష్ వెల్లడించారు.
మీ సమస్యలు దయచేసి తనకు వాట్సప్ చేయొద్దని సూచించారు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] పంపించాలన్నారు. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన హలో లోకేష్ కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి [email protected] క్రియేట్ చేసుకున్నట్లు తెలిపారు.