ఏపీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు ఎవరు గెలిస్తే వారిదే అధికారం అని తెలుస్తోండగా దీంతో పాటు టీడీపీకి మరో సెంటిమెంట్ ఉంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ గెలిస్తే ఆ పార్టీకి అధికారం దక్కదు. గతంలో పలుమార్లు ఇది నిరూపితమైంది.
2004, 2009ల్లో ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందగా టీడీపీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. 2014లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019లో పయ్యావుల కేశవ్ గెలుపొందగా టీడీపీ అధికారం కొల్పోయింది.
ఇక ఈ సారి కూడా పోరు పయ్యావుల వర్సెస్ విశ్వేశ్వ్ రెడ్డి మధ్య జరుగగా ఎవరు గెలిచినా.. గెలిచిన వారి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంటు ఉంది. మరి ఈసారి ఉరవకొండ ప్రజలు ఎవరికి జై కొట్టారు?,ఇక ఇక్కడ గెలిచిన అభ్యర్థి పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్‌ని ఈ సారి తిరగరాస్తారా వేచిచూడాలి.