- Advertisement -

జమిలి ముహూర్తం సిద్దం..కేంద్రం కొత్త వ్యూహం

- Advertisement -

కేంద్రం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. విపక్షాలను దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనుంది. అదే విధంగా జమిలి ఎన్నికలను సైతం 2029 లోనే అమలు చేసేందుకు రూట్ మ్యాప్ సిద్దం అవుతోంది. దీంతో.. 2029 ఎన్నికలు పూర్తిగా కొత్త లెక్కలు..అంచనాలతో జరగటం ఖాయంగా కనిపిస్తోంది.

మోదీ 4.0 కోసం కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. గత సమావేశాల్లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ డీ లిమిటేషన్ బిల్లును ఈ సారి వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం అవసరమైన సంఖ్యా బలం ఇప్పటికే సిద్దం చేసుకున్నారు. శివసేన(థాకరే) వర్గం, టీఎంసీ చీలిక నేతలు, ఆప్ నుంచి చేరిన ఎంపీలతో ఇప్పుడు ఎన్డీఏ సంఖ్యా బలం పార్లమెంట్ లో మరింత గా పెరిగింది. దీంతో.. ఈ బిల్లులను ఆమోదించుకునేందుకు బీజేపీ సిద్దం అవుతోంది. డీలిమిటేషన్ పైన కొత్త ఫార్ములా అమలు చేయాలని భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడా అన్యాయం లేకుండా ఈ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా 2029 లోనే జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ అంశం పైన ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక సమర్పణకు సిద్దం అవుతోంది.

2029 లోనే జమిలి ఎన్నికల కల సాకారమవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చీఫ్‌, కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌధరి ఆశాభావం వ్యక్తంచేశారు. జమిలి ఎన్నికలను ఎలా నిర్వహిస్తే బాగుంటుంది.. ఎదురయ్యే సవాళ్లు ఏమిటి.. వాటిని ఎలా పరిష్కరించాలో గోవా ముఖ్యమంత్రి అభిప్రాయాలు తెలుసుకున్నామని తెలిపారు. దాదాపుగా 99 శాతం మంది జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థించారని.. ప్రస్తుతం అన్ని పార్టీలకూ ఆమోదయోగ్యమైన వ్యవస్థ కోసం కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. తదుపరి లోక్‌సభ ఎన్నికలు జరిగే 2029నాటికి ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. దీంతో.. 209 ఎన్నికల నాటికి బీజేపీ ప్రణాళికలు యథావిధిగా అమలు చేయగలిగితే ఒకే సారి 2029 లోనే కొత్త నియోజకవర్గాలతో పాటుగా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ.. జమిలి జరిగే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -