తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ బండ్రు శోభారాణి మధ్య డైలాగ్ వార్ నెలకొంది. ఏకంగా కౌశిక్ రెడ్డికి చెప్పు చూపిస్తూ ఛాలెంజ్ ఇచ్చారు శోభారాణి.
తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందని..ఆ మహిళలను అడ్డు పెట్టుకుని కౌశిక్ రెడ్డి విజయం సాధించారన్నారు. పాడి కౌశిక్ రెడ్డి చీర గాజులు పంపాలి అనుకుంటే మొదట కేసిఆర్ కు పంపాలని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టిందపి..కౌశిక్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అన్నారు.
అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరుతున్నాం అన్నారు శోభారాణి.
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర నీది అని గుర్తు చేశారు. బిడ్డ, భార్యను అడ్డుపెట్టుకొని చనిపోతాం అని ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు కౌశిక్ రెడ్డి అన్నారు. మహిళలకు క్షమాపణ చెప్పకపోతే బయట తిరగనివ్వమన్నారు.