టాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రం ‘హను-మాన్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే సినిమా యూనివర్స్ నుంచి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.
ఈ చిత్రానికి ‘హనుమాన్ 2: ది రైజ్ ఆఫ్ వానరాస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఫాంటసీ యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు మరో అద్భుతమైన లోకాన్ని తీసుకురానున్నారు. ఈ చిత్రంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయన సరైన పాత్రలో కనిపించబోతున్నారని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగాన్ని నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సీక్వెల్‌ను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మేరకు శనివారం చిత్ర యూనిట్ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
విడుదలైన ప్రీలుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. హనుమంతుడి దివ్య సన్నిధ్యాంలో హీరో ఆకాశంలో ఎగురుతున్నట్లు ఈ పోస్టర్లో చూపించారు. హీరో చుట్టూ ఆ స్వామివారి భారీ తోక రక్షణ కవచంలా చుట్టుకుని ఉండటం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

