పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. దీంతో ఇప్పటివరకు ఆరు పతాకాలను సాధించింది భారత్. కాంస్యం కోసం జరిగిన పోరులో అమన్ 13-5తో క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను ఓడించాడు. దీంతో రెజ్లింగ్‌లో భారత్‌కు పారిస్‌లో ఇదే తొలి పతకం.
సెమీస్‌లో ఓడినా కాంస్య పోరులో మాత్రం చక్కటి పోరాట ప్రతిభ కనబర్చాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి 6-3 ఆధిక్యంలో ఉన్న అమన్ రెండో రౌండ్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేశాడు. అమన్ ధాటికి క్రజ్ డెరియన్ కోలుకోలేకపోయాడు. దీంతో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది.
ఇక విజయంతో భారత్ తరఫున అత్యంత పిన్న వయస్సు(21ఏండ్లు) లో ఒలింపిక్ పతకం నెగ్గిన తొలి ఆటగాడిగా నిలిచాడు ఆమన్. రెజ్లింగ్ విభాగంలో భారత ఒలింపిక్ చరిత్రలో ఇది ఏడో పతకం. హాసుశీల్ కుమార్ (2008, 2012), యోగేశ్వర్ దత్ (2012), సాక్షి మాలిక్ (2016), భజరంగ్ పునియా, రవి దహియా (2020) అమన్ కంటే ముందు పతకాలు సాధించారు. హాకీలో అత్యధికంగా ఇప్పటివరకు అన్ని ఒలింపిక్స్ కలిపి 13 పతకాలు రాగా ఆ తర్వాత రెజ్లింగ్‌లోనే భారత్ పతకాలు సాధించింది.