- Advertisement -

పారాలింపిక్స్ చరిత్రలో భారత్…తొలిసారి

- Advertisement -

పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఆటగాళ్లు అద్భుత ఆటతీరుతో పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు రాగా ఇవాళ ఒక్కరోజే 5 పతకాలు గెలుచుకుంది. ఇదే జోరు కొనసాగితే ఖచ్చితంగా మరో ఐదు పతకాలు రావడం ఖాయమని తెలుస్తోంది.

ఇవాళ జరిగిన పోటీల్లో స్ప్రింట్ దీప్తి జీవన్‌జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్‌ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు. వీరితో పాటూ మెనస్ జావెలిన్ త్రో ఎఫ్‌46లో అజీత్ సిల్వర్, సుందర్ సింగ్ బ్రాంజ్ గెలుచుకున్నారు.

గత పారాలింపిక్స్‌లో 19 పతకాలు గెలుచుకున్న భారత్..ఈసారి మరిన్ని ఈవెంట్లు ఉండగానే 20 పతకాలను గెలుచుకుని పాయింట్ల పట్టికలో 19వ స్థానంలో ఉంది.

రాజస్థాన్‌కు చెందిన పారా షూటర్‌ అవనీ లేఖరా స్వర్ణం సాధించగా , ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -